పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తనకెంతో ఇష్టమని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తెలిపాడు. ‘బాహుబలి’ చూపినప్పటి నుంచి తాను ప్రభాస్‌కు ఫ్యాన్ అయ్యానని అన్నాడు. చిరంజీవి డ్యాన్స్ అంటే కూడా తనకు ఇష్టమని చెప్పాడు. ‘ఆహా’లో ప్రసారమవుతోన్న ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమంలో అయాన్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
మరోవైపు, అల్లు అర్జున్‌కు కూడా ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమనే విషయం తెలిసిందే.వీరిద్దరూ ఎంతో కాలం నుంచి స్నేహితులుగా ఉన్నారు.ప్రభాస్ ఆరడుగుల బంగారం అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.