రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మళ్ళీ తీవ్రమైంది.మొన్న ఉక్రెయిన్ ఇతర దేశాల ఆయుధాలను వాడిందని రష్యా ఆరోపించింది.రష్యా తొలిసారిగా యుద్ధంలో దీర్ఘశ్రేణి ఆయుధాన్ని వాడింది.ఉక్రెయిన్ మీద ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని క్లీవ్ ఎయిర్ ఫోర్ప్ ధృవీకరించింది.అయితే ఏ రకమైన క్షిపణిని ప్రయోగించారో కచ్చితంగా చెప్పలేదు.ఈ మేరకు ఎక్స్-47ఎం2 కింజల్ బాలిస్టిక్ క్షిపణిని కూడా ప్రయోగించినట్లు తెలిపింది.మరోవైపు ఉక్రెయిన్ ఆరోపణలపై స్పందించేందుకు రష్యా నిరాకరించింది.ఈ అంశంపై చెప్పేందుకు ఏమీ లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు.ఇది తమ సైనికులను అడిగాల్సిన ప్రశ్న అని అన్నారు.
అయితే ఉక్రెయిన్ కూడా ఇవే ఆయుధాలను ప్రయోగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.అమెరికా అధ్యక్షుడు బైడెన్ దీనికి అనుమతినిచ్చిచారు అని సమాచారం.ఈ అంశంపై రష్యా తీవ్రంగా స్పందించింది.వెంటనే రష్యా కూడా అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు వీలుగా నిన్న అధ్యక్షుడు పుతిన్ ఆమోదించారు.దీనికి సంబంధించిన పత్రాల మీదన సంతకాలు చేశారు.కాగా రష్యా కూడా భారీగా దాడి చేయవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వారి అభిప్రాయం వ్యక్తం చేసిన మేరా రష్యా ఈరోజు ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది.