భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పెర్త్ వేదికగా నేడు ప్రారంభమైంది.మొదటి రోజు ఆద్యంతం ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆలౌటైంది. తెలుగు తేజం నితీశ్ రెడ్డి (41) టాప్ స్కోరర్. రిషబ్ పంత్ (37), కేఎల్ రాహుల్ (26) ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. హేజిల్ వుడ్ 4 వికెట్లను పడగొట్టాడు. స్టార్క్, కమ్మిన్స్, మార్ష్ రెండు వికెట్లు చొప్పున పడగొట్టాడు. ఇక అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ కూడా బ్యాటింగ్ లో భారత బౌలర్ల ధాటికి తడబడింది. భారత కెప్టెన్ బుమ్రా కళ్లు చెదిరే బంతులతో మొదటి నాథన్ (10), కవాజా (8), స్మిత్ (0) మూడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు. ట్రావిస్ హెడ్ (13) ను హార్షిత్ రాణా బౌల్డ్ చేశాడు. మార్ష్ (6), లబూషేన్ (2) ను సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో 47 పరుగులకే ఆసీస్ 6 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ (3) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. అలెక్స్ క్యారీ (19నాటౌట్), స్టార్క్ (6నాటౌట్) క్రీజులో ఉన్నారు. బుమ్రా 4 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, హార్షిత్ రాణా 1 వికెట్ పడగొట్టారు.
Previous Articleఉక్రెయిన్ పై క్షిపణి దాడి చేసిన రష్యా…!
Next Article భారీ లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల జోరు