సముద్ర తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసి, నిర్దేశిత ప్రాంతంలోనే వాటిని వదిలేలా చూడటం ద్వారా మత్స్య సంపదకు విఘాతం కలగకుండా చర్యలు చేపడతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.
పర్యావరణాన్ని పరిరక్షించుకొంటూనే పారిశ్రామిక అభివృద్ధి సాధించాలని ఈ క్రమంలో మత్స్యకారుల జీవనోపాధులకు ఇబ్బందులకు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. మత్స్యకార ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు డిప్యూటీ సీఎంతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు వివరించారు. చమురు సంస్థలు సహజ వాయు నిక్షేపాల కోసం సాగిస్తున్న తవ్వకాల మూలంగా చేపల వేటకు ఇబ్బందులు వస్తున్నాయని, మత్స్య సంపద దెబ్బ తింటుందనీ ఆవేదన వ్యక్తంచేశారు. కొన్ని ప్రాంతాల్లో పరిహారం ఇచ్చారని… మరికొన్ని చోట్ల ఇవ్వలేదని పవన్ దృష్టికి తీసుకువచ్చారు. మత్స్యకారులకు గత ప్రభుత్వంలో సబ్సిడీలు కూడా సక్రమంగా అందలేదని తెలిపారు. సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తగిన కార్యాచరణ సిద్ధం చేస్తుందని పవన్ వారికి తెలిపారు. చమురు కంపెనీలు నుండి ప్రభావిత ప్రాంతాలు అన్నింటా పరిహారం అందేలా చూస్తామని, అధికారులతో సమీక్ష చేపడతామని తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఓషనోగ్రఫీ ప్రొఫెసర్లు, మత్స్య శాస్త్ర నిపుణులు, సంబంధిత అధికారులతో అధ్యయనం చేయించడంతోపాటు, ఫిషరీష్, ఇండస్ట్రీస్, పీసీబీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని వివరించారు.
మత్స్య సంపదకు విఘాతం కలగకుండా కాలుష్య నివారణ చర్యలు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్
By admin1 Min Read
Previous Articleబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్
Next Article మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి షాక్