అక్కినేని నటవారసుడుగా తెరంగేట్రం చేసి వారసత్వాన్ని నిలబెడుతూ ముందుకు సాగుతున్నారు నాగచైతన్య. కెరీర్ ఆరంభం నుండి వైవిధ్యమైన పాత్రలతో విభిన్నమైన చిత్రాలతోప్రేక్షకుల మన్ననలు పొందారు. ప్రస్తుతం ఆయన చందూ మొండేటి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘తండేల్’. సాయి పల్లవి కథానాయిక నటిస్తోంది. నేడు ఆయన పుట్టిన రోజు. ఈసందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం నుండి చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో నాగచైతన్య కొత్త ఆహార్యం లో కనిపించారు. చూడగానే ఆకట్టుకునేలా మేకర్స్ ఈ స్పెషల్ పోస్టర్ను డిజైన్ చేశారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 వారు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. 2025 ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Previous Articleఝార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యంలో ఇండియా కూటమి
Next Article భారీ ఆధిక్యంలో ప్రియాంక వాద్రా …!

