భారత బ్యాటింగ్ సంచలనం రిషభ్ పంత్ మరో అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో 37 పరుగులు చేసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో 2,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి వికెట్ కీపర్ గా చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్ పంత్ కావడం విశేషం. ప్రస్తుతం 2,034 పరుగులతో డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్ గా పంత్ కొనసాగుతున్నాడు. 1,930 పరుగులతో పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ రెండవ స్థానంలో ఉన్నాడు.
Previous Articleభారీ ఆధిక్యంలో ప్రియాంక వాద్రా …!
Next Article అమెరికాలో “గేమ్ ఛేంజర్ ” ప్రీ రిలీజ్ ఈవెంట్..!