మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తో్న్న చిత్రం ‘కన్నప్ప’.ముఖేశ్ కుమార్ సింగ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.మోహన్‌బాబు నిర్మిస్తున్నారు.ఈ సినిమా విడుదల విషయంలో నెలకొన్ని సందిగ్ధతకు విష్ణు చెక్ పెట్టారు. వేసవి కానుకగా ఏప్రిల్ 25న ఇది ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని తాజాగా ప్రకటించారు. భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ‘కన్నప్ప’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా ఇది సిద్ధం కానున్న విషయం తెలిసిందే.ప్రభాస్, అక్షయ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
#HarHarMahadevॐ #Kannappa🏹 pic.twitter.com/qGFxAOKp14
— Vishnu Manchu (@iVishnuManchu) November 25, 2024