అంతర్జాతీయ సానుకూల సంకేతాలు ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాల ప్రభావంతో దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ బీఎస్ఈలో 992 పాయింట్ల లాభంతో 80,109 వద్ద ట్రేడింగ్ ముగించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ సైతం 314 పాయింట్లు లాభపడి 24,221 వద్ద ముగిసింది. సెన్సెక్స్ అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్, ఎల్ అండ్ టీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభాల్లో ముగిశాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.84.30గా కొనసాగుతోంది.
Previous Articleడిసెంబర్ లో రెండు రాకెట్ ప్రయోగాలను చేపట్టనున్న ‘ఇస్రో’
Next Article కన్నప్ప రిలీజ్ డేట్ వచ్చేసింది..!