సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న విషయం తెలిసిందే.తాజాగా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు.తాను ఎక్కడికి పారిపోలేద్దన్నారు.సినిమా షూట్ లో బిజీ గా ఉన్నానని తెలిపారు.తనపై జరుగుతున్న ప్రచారం నిజం కాదంటూ…పెట్టిన కేసులపై అనుమానాలు ఉన్నాయని…తనపై పెట్టిన సెక్షన్స్ ఎలా వర్తిస్తాయో అర్దం కావట్లేదంటూ ఆయన వీడియో విడుదల చేశారు.ఏపీ పోలీసుల నోటీసులకు తాను భయపడడం లేదని అన్నారు.
తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయ్...తాను పోస్టు ఎవరి ఉద్దేశించి పెట్టానో…వారికి కాకుండా ఇంకెవరో సంబంధం లేని థర్డ్ పార్టీ వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు,సెక్షన్లు ఎలా వర్తిస్తాయనేది తనకు అర్ధం కావట్లేదని అన్నారు.