దేశంలో 2022-23లో 23.58 కోట్ల టన్నులున్న పాల ఉత్పత్తి 2023-24లో 23.93 కోట్ల టన్నులకు చేరింది. 2014-15లో పాల ఉత్పత్తి కేవలం 14.63 కోట్ల టన్నులు. గత ఏడాది గేదెల నుండి పాల ఉత్పత్తి 16 శాతం తగ్గినా మొత్తం మీద ఉత్పాదకత పెరగడం గమనార్హం. అవు పాల ఉత్పత్తి భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో మన దేశమే అతి పెద్ద పాల ఉత్పత్తిదారు. శ్వేత విప్లవ పితామహుడు అయిన వరీస్ కురియన్ జన్మదినమైన నవంబరు 26ను ప్రతి సంవత్సరం జాతీయ పాల దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ప్రసంగించిన కేంద్ర పశు సంవర్థకశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ దేశంలో 2022-23లో తలసరి పాల లభ్యత 459 గ్రాములు కాగా ఇప్పుడది 471 గ్రాములకు పెరిగినట్లు తెలిపారు.
దేశంలో పెరిగిన పాల ఉత్పత్తి:ప్రపంచంలో అతి పెద్ద పాల ఉత్పత్తిదారు భారత్
By admin1 Min Read
Previous Articleమహా కుంభమేళాలో రోబోల సేవలు
Next Article నేను ఎవరికీ భయపడను: రాంగోపాల్ వర్మ