ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ఆటగాళ్ల జాబితాలో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. బౌలింగ్ విభాగంలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (883 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (423) రవిచంద్రన్ అశ్విన్ (290) వరుసగా మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. ఆసీస్ పై భారీ శతకం నమోదు చేసిన యశస్వీ జైశ్వాల్ (825) బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో నిలిచాడు. రిషబ్ పంత్ (736) 6వ స్థానంలో కొనసాగుతున్నాడు.
బ్యాటింగ్ టాప్-10:
1.జో రూట్ (903) 2.యశస్వీ జైశ్వాల్ (825) 3.కేన్ విలియమ్సన్ (804), 4.హ్యారీ బ్రూక్ (778), 5.డేరీ మిచెల్ (743), 6.రిషబ్ పంత్ (736),7. స్టీవ్ స్మిత్ (726), 8.సౌద్ షకీల్ (724), 9.కమిందు మెండీస్ (716), 10.ట్రావిస్ హెడ్ (713).
బౌలింగ్ టాప్-10:
జస్ప్రీత్ బుమ్రా (883) 2. కగిసో రబాడా (872), 3. హాజల్ వుడ్ (860), 4. రవిచంద్రన్ అశ్విన్ (807), 5.జయసూర్య (801), 6. పాట్ కమ్మిన్స్ (796), 7. రవీంద్ర జడేజా (794), 8.నాథన్ లైయన్ (782), 9.నోమన్ అలీ (759), 10. ఎం.జె.హెన్రీ (750).
ఆల్ రౌండర్ టాప్-10:
రవీంద్ర జడేజా (423),2. రవిచంద్రన్ అశ్విన్ (290),3.షకీబుల్ హాసన్ (269), 4.మెహాదీ హాసన్ (269), 5.జేసన్ హోల్డర్ (264), 6.జో రూట్ (262), 7.అక్షర్ పటేల్ (239), 8.క్రిస్ వోక్స్ (229), 9. పాట్ కమ్మిన్స్(224), 10.బెన్ స్టోక్స్ (218).