ఈ ఏడాదిలో విమానాలకు భారీగా బెదిరింపులు వచ్చాయి.పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈ విషయంపై చర్చలు జరిగాయి.ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ మాట్లాడుతూ 2024లో ఇప్పటివరకు భారత విమానయాన సంస్థలకు 994 బూటకపు బాంబు బెదిరింపులు వచ్చినట్లు వెల్లడించారు. 2022 నుంచి 2024 నవంబర్ 13 వరకు మొత్తం 1,143 బెదిరింపులు నయోదయ్యాయని వెల్లడించారు.
ఇటువంటి బెదిరింపులు క్రమంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.బెదిరింపులకు పాల్పడుతున్న వారి లొకేషన్ గురించి సరైన సమాచారం తెలియకపోవడంతో దర్యాప్తు ఆలస్యమవుతోందని అన్నారు.ఇటువంటి చర్యలను కట్టడి చేయడానికి పౌర విమానయాన భద్రత మండలి,ఏవియేషన్ సెక్యూరిటీ రెగ్యులేటర్ కృషి చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.