చేయని తప్పుకు 30 ఏళ్ల జీవితాన్ని కోల్పోయాడో వ్యక్తి…పెళ్లి చూసుకుని పెళ్ళాం పిల్లలతో ఉండాల్సిన అతను మూడు దశాబ్ధాల పాటు కారాగారంలో జీవితాన్ని వెళ్ళబుచ్చాడు.కుటుంబాన్ని కోల్పోయాడు..కట్ చేస్తే ఆతనికి రూ.110 కోట్లు వరించాయి.ఇంతకీ అదెలా అంటే..నిరపరాధి అయినప్పటికీ దొంగతనం,హత్య కేసులో దాదాపు మూడు దశాబ్దాలపాటు జైలులో మగ్గిపోయిన మైఖేల్ సూలివాన్ (64)కు దాదాపు రూ.110 కోట్ల పరిహారం లభించింది.1986లో మసాచుసెట్స్‌లోని ఫ్రామింగ్‌హామ్‌లో విల్‌ఫ్రెడ్ మెక్‌గ్రాత్ దొంగతనం, హత్యకు గురయ్యాడు.ఈ కేసులో గ్యారీ గ్రేస్, మైఖేల్‌ను గ్యారీ అనుమానితులు.మైఖేల్ ను ఇరికించి గ్యారి పక్కకు తప్పుకున్నాడు.
దీంతో మైఖేల్‌కు యావజ్జీవ జైలు శిక్ష పడింది.మసాచుసెట్స్ జ్యూరీ ఇటీవల ఈ కేసులో మైఖేల్ నిర్దోషి అని తీర్పు చెప్పింది.ఆయనకు నష్టపరిహారంగా రూ.110 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.ఆయన జైలులో ఉన్న కాలంలో ఆయన తల్లి,నలుగురు తోబుట్టువులు మరణించారు.జైలులో అనేకసార్లు ఆయన దాడులకు గురయ్యారు.