బంగ్లాదేశ్‌లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్‌నెస్ (ISKON)ను నిషేధించే దిశగా అడుగులు పడుతున్నాయి.ఈ మేరకు ఆ దేశ అటార్నీ జనరల్ ముహమ్మద్ అసదుజ్జమన్ ప్రకటన చేశారు.ఇస్కాన్‌ను బ్యాన్ చేయడంపై ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని ఆ దేశ సుప్రీంకోర్టులో ఆయన స్పష్టం చేశారు.
హిందువులపై దాడులు,దేవాలయాలు విధ్వంసం..!
హిందువుల పరిస్థితి దారుణంగా తయారైంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన మంత్రి ముహమ్మద్ యూనస్ ప్రభుత్వ ప్రోద్బలంతో, ఇస్లామిక్ ఛాందసవాదులు ఇప్పుడు హిందువులకు వ్యతిరేకంగా బహిరంగంగా వీధుల్లోకి వచ్చి హిందువులపై దాడులు చేస్తున్నారు.హిందువులపై దాడులకు నిరసనలలో పాల్గొన్న ఇస్కాన్ చెందిన చిన్మోయ్ కృష్ణ దాస్‌ను బంగ్లా దేశ్ పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారు.ఈ చర్య గురించి బంగ్లాదేశ్‌లోని వాక్ స్వాతంత్ర్యం,మత సామరస్యం,మైనారిటీ కమ్యూనిటీల రక్షణ గురించి పలు హిందు సంస్థలు తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేసింది.ఈ క్రమంలోనే పలువురు ఇస్లామిక్ వాదులు బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలు,దుకాణాలపై నిరంతరం దాడులు చేస్తున్నారు.ఇప్పటికే హజారిలేన్‌లోని శివాలయం కూల్చివేయబడగా, ఛటోగ్రామ్‌లోని మానస మాత ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారు. మన్హర్‌లో హిందూ దుకాణాలను లూటీ చేశారు.ఈ క్రమంలో లోక్‌నాథ్ ఆలయం, మానసమాత ఆలయం,కాళీమాత దేవాలయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.హిందువులపై దాడులు, వారి ఆస్తులు విధ్వంసం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.3 కోట్ల మంది హిందువులు భయాందోళన చెందుతున్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఛాందసవాదుల దాడిలో దాదాపు 250 మంది హిందువులు గాయపడ్డారని, మరికొంత మంది మరణించారని పేర్కొన్నారు.
24×7 attack on Hindus & Hindu places of worship in #Bangladesh. When will it all STOP? @TulsiGabbard @realDonaldTrump @narendramodi pic.twitter.com/8fSsx2N1Ny
— Radharamn Das राधारमण दास (@RadharamnDas) November 27, 2024