ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో మరో డ్రా నమోదైంది. భారత యువ ఆటగాడు గుకేశ్ డిఫెండింగ్ చాంపియన్ చైనా క్రీడాకారుడు డింగ్ లిరెన్ లీ మధ్య జరిగిన నాలుగో గేమ్ డ్రా గా ముగిసింది. మూడో రౌండ్ లో మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకుని విజయం సాధించిన గుకేశ్ నాలుగో రౌండ్ లో కూడా చక్కని ఆటతీరు కనబరిచాడు. దూకుడుగా ఎత్తులు వేస్తూ లీరెన్ తో తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన ఈ గేమ్ లో ఇద్దరు ఆటగాళ్లు 42 ఎత్తుల దగ్గర డ్రా కు ఒప్పుకున్నారు. ఇక ఈ ఛాంపియన్ షిప్ లో నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి 2-2తో సమానంగా ఉన్నారు. ఇంకా 10 రౌండ్లు మిగిలి ఉన్నాయి.
Previous Articleపుష్ప కలెక్షన్స్ గురించి మేము ఆలోచించ లేదు: అల్లు అర్జున్
Next Article సెమీస్ చేరిన భారత షట్లర్లు..!