నీతి ఆయోగ్ తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంటు పై ఏపీ సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 12వ తేదీన విద్యార్థులు, సామాన్య ప్రజల సమక్షంలో ఈ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. పేదరికం లేని సమాజం, ఉపాధి కల్పన, నైపుణ్యం- మానవవనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయంలో సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు -బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్… అనే ప్రధాన సూత్రాలు ఈ డాక్యుమెంట్ లో ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. ఆశించిన లక్ష్యాలను సాధించే దిశలో విజన్ డాక్యుమెంట్ ఉండాలని సీఎం ఈ సమావేశంలో సూచించారు. ఇక 17 లక్షల మంది మేధావులు, వివిధ రంగాల నిపుణులు, సాధారణ ప్రజలు విజన్ డాక్యుమెంట్ పై తమ సలహాలు, సూచనలు అందించారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటూ డాక్యుమెంటు నమూనాను రూపొందించి శాసనసభ సమావేశాలలో ఇటీవల ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.
ఆశించిన లక్ష్యాలను సాధించే దిశలో విజన్ డాక్యుమెంట్ ఉండాలి: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read
Previous Articleదేశంలో పెరిగిన సబ్బుల ధరలు..!
Next Article అల్లు అర్జున్ ను ప్రశంసించిన టీజీ సీఎం రేవంత్ రెడ్డి