పోర్న్ (అశ్లీల) చిత్రాల నిర్మాణం కేసులో నటి శిల్పా శెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా నివాసం, కార్యాలయాల్లో ఈడి సోదాలు చేస్తున్నట్టు శుక్రవారం వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె తరఫు న్యాయవాది స్పందించారు. ఆయా వార్తల్లో నిజం లేదన్నారు. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతుంది. రాజ్ అధికారులకు సహకరిస్తున్నారు.
ఈడీ సోదాల్లో ఎలాంటి నిజం లేదు. ఈ సోదాల్లో జరుగుతున్నట్టు వస్తోన్న వార్తల్లో శిల్పా శెట్టి ఫొటోస్ అస్సలు వాడొద్దు అని మీడియా కు తెలిపారు.అశ్లీల చిత్రాలు నిర్మించి పలు యాప్ లా ద్వారా వాటిని విడుదల చేస్తున్నారే ఆరోపణలతో 2021లో రాజ్ పై కేసు నమోదు అయింది. కొంతకాలం ఆయన జైల్లో ఉన్నారు.