అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ పుష్ప ది రూల్ ‘. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈచిత్రం మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో రెండో భాగంపై అంబరాన్ని తాకేలా అంచనాలున్నాయి. డిసెంబర్ 5న ఈచిత్రం విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుండి బెనిఫిట్ షోలతో పాటు అర్ధరాత్రి 1 షోలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు రూ.800గా ఖరారు చేసింది. సింగిల్ స్క్రీన్ లేదా మల్టీప్లెక్స్ ఏదైనా సరే టికెట్ ధర 800 లేనని చెప్పింది. మరోవైపు అర్థరాత్రి ఒంటి గంట నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు అనుమతినిచ్చింది. డిసెంబర్ 5 నుండి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 అనుమతి ఇచ్చింది.
Previous Articleవిజికీ మీడియా విజిబిలిటీ ర్యాంకింగ్స్ లో రిలయన్స్ కు అగ్రస్థానం
Next Article తూఫాన్ ఎఫెక్ట్.. చెన్నై ఎయిర్పోర్ట్ మూసివేత