పృథ్వి రాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘లూసిఫర్’. రాజకీయ నేపథ్యమున్న యాక్షన్ భరిత వినోదాత్మక కథాంశంతో రూపొందిన ఈచిత్రం భారీ ప్రేక్షకాదరణ పొంది ఘన విజయం నమోదు చేసింది. కాగా, ఈచిత్రానికి రెండో భాగం కూడా రానుంది.’లూసిఫర్’:ఎంపురాన్ గా రానుంది. గతేడాది ప్రారంభమైన ఈచిత్ర చిత్రీకరణ తాజాగా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మోహన్ లాల్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. చిత్రీకరణ పూర్తయింది. యూ.కే, యూ.ఎస్.ఏ, యూ.ఏ.ఈ సహా 8 రాష్ట్రాలు మరియు 4 దేశాలలో 14 నెలల అద్భుతమైన ప్రయాణమని తెలిపారు . మురళీ గోపీ ఈ సినిమాకి మూలాధారమైన కథను అందించినందుకు ధన్యవాదాలని పేర్కొన్నారు. దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక కళాకారుడిగా తన ప్రయాణంలో ‘ఎంపురాన్ ‘ ఒక గొప్ప అధ్యాయమని పేర్కొన్నారు. 2025 మార్చి 27న ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Previous Articleరైతు భరోసా అమలు చేస్తాం:- తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి
Next Article బంగ్లాదేశ్ హిందువులపై దాడులు…ఏపిలో ప్రకంపనలు…!