గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయి.ప్రధాని పదవి నుండి షేక్ హసీనా బలవంతంగా తప్పుకోవాల్సి రావడం, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడడం,ఇటీవల హిందువులపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్ విశాఖలోనూ వినిపించాయి.అయితే ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంటర్నేషనల్ హాస్టల్ వద్ద జనజాగరణ్ సమితి, హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి.
అయితే బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను నిరసిస్తూ…నినాదాలు చేశారు.ఆంధ్ర యూనివర్సిటీలో హాస్టల్లో బంగ్లాదేశీ విద్యార్థులు వారి స్వదేశానికి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు.ఈ మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.