2025 ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వనున్న పాక్ భారత్ కోరిన హైబ్రిడ్ మోడల్ కు సంబంధించి ఒక మెలిక పెట్టిన సంగతి తెలిసిందే. భారత్ పాక్ కు వెళ్లడం నిరాకరించిన నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్ ఒకటే పరిష్కారమని ఐసీసీ పేర్కొనగా… దీనిపై పాక్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. హైబ్రిడ్ మోడల్ కు సరే నని కానీ భవిష్యత్తులో తమ జట్టు కూడా ఐసీసీ టోర్నీలలో భారత్ కు వెళ్లకూడదని నిర్ణయిస్తే తమకు ఇదే విధంగా హైబ్రిడ్ మోడల్ లో మ్యాచ్ లు ఏర్పాటు చేయాలని కోరింది. ఇక ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు మాజీ టీమిండియా టర్బోనేటర్ చురకలంటించాడు. మీకు ఇష్టం లేకపోతే భారత్ కు రావొద్దని పేర్కొన్నాడు. అందులో తమకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నాడు. పాక్ జట్టు భారత్ కు రాకపోయినా ఎవరూ పట్టించుకోరని అన్నాడు. పాకిస్థాన్ లో పరిస్థితి వేరేలా ఉంటే ఈ విషయంలో భారత వైఖరి మరోలా ఉండేదని చెప్పాడు. మొండి వైఖరి వదిలి సిరీస్ జరగనివ్వాలన్నాడు. శ్రీలంక, మలేసియా ఇలా ఇతర దేశాలు ఆతిథ్యం కోసం ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. పాక్ లో పరిస్థితులు చక్కబడేవరకు భారత జట్టు ఆ దేశంలో పర్యటించదని పేర్కొన్నాడు.
Previous Articleరైతుకి అండగా నిలుస్తుంది కూటమి ప్రభుత్వం: మాజీ సీఎం జగన్ కు ఏపీ మంత్రి నాదెండ్ల కౌంటర్
Next Article విశాఖ మెట్రో రైల్.. డీపీఆర్ కు ప్రభుత్వం ఆమోదం