రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ లో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా కూటమి ప్రభుత్వానికి లేకుండాపోయిందని, ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ‘ఎక్స్’ వేదికగా దుయ్యబట్టారు. కాగా, దీనికి ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు నాదెండ్ల ట్వీట్ చేశారు.గుడ్ మార్నింగ్ జగన్ గారూ.. వాస్తవాలు చెప్పే లెక్కలు ఓసారి కళ్ళారా చూడండి. మీ నిర్వాకం తెలుస్తుంది. మీ పాలనలో సరిగ్గా ఈ సమయానికి సేకరించిన ధాన్యం 4.43 మెట్రిక్ టన్నులు. బాధ్యతతో కూటమి ప్రభుత్వం సేకరించిన ధాన్యం 9.14 మెట్రిక్ టన్నులు. సేకరించిన 24 గంటల్లో రైతు ఖాతాలోకి డబ్బులు వేస్తున్నాం అంటూ నాదెండ్ల బదులిచ్చారు. రైతుకి అండగా నిలుస్తుంది కూటమి ప్రభుత్వం అని మనోహర్ పేర్కొన్నారు.
Good Morning @ysjagan గారూ.. వాస్తవాలు చెప్పే లెక్కలు ఓసారి కళ్ళారా చూడండి. మీ నిర్వాకం తెలుస్తుంది.
మీ పాలనలో సరిగ్గా ఈ సమయానికి సేకరించిన ధాన్యం 4.43 మెట్రిక్ టన్నులు. బాధ్యతతో కూటమి ప్రభుత్వం సేకరించిన ధాన్యం 9.14 మెట్రిక్ టన్నులు. సేకరించిన 24 గంటల్లో రైతు ఖాతాలోకి డబ్బులు… pic.twitter.com/navSo0SefW— Manohar Nadendla (@mnadendla) December 3, 2024