ప్రముఖ సంగీత దర్శకుడు,గాయకుడు రమణ గోగులకు టాలీవుడ్‌లో మంచి పేరు ఉంది.గతంలో ప్రేమంటే ఇదేరా, తమ్ముడు, బద్రి, జానీ వంటి చిత్రాలతో ఆయన మ్యూజిక్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.దాదాపు 18 ఏళ్ల తర్వాత ఆయన మరోసారి తన మ్యూజిక్‌తో మేజిక్ చేయడానికి సిద్ధమయ్యారు.వెంకటేశ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” లో ఆయన గోదారి గట్టు మీద రామ చిలకే అనే పాట ఆలపించారు. తాజాగా ఈ పాటను చిత్రబృందం విడుదల చేసింది.భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా…రమణ గోగుల, మధు ప్రియ ఈపాట పాడారు.అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈచిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు.
అయితే సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు, 2013లో విడుదలైన 1000 అబద్ధాలు సినిమా తర్వాత రమణ గోగుల సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఆయన గాయకుడిగా ఆలరిస్తుండటంతో సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.వెంకటేశ్ నటించిన ప్రేమంటే ఇదేరా, లక్ష్మి వంటి చిత్రాలకు రమణ స్వరాలు అందించిన విషయం తెలిసిందే.