ఇజ్రాయెల్ – హమాస్ మధ్య గతేడాది నుంచి యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. దీని వల్ల పశ్చిమాసియా దేశంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ చెరలోని బందీలకు సంబంధించిన ఓ వీడియోను ఇటీవల హమాస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిలిటెంట్ సంస్థపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టే లోపు బందీలను విడుదల చేయకపోతే నరకం చూపిస్తానని హెచ్చరించారు. ‘నేను అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న బాధ్యతలు అందుకుంటా. ఈలోపు బందీలను విడుదల చేయాలి. అలా కానీ పక్షంలో ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడేవారికి తప్పకుండా నరకం చూపిస్తా. చరిత్రలో ఎప్పుడూ చూడని తీవ్ర పరిణామాలు వాళ్లు ఎదుర్కొనేలా చేస్తా’ అని సోషల్‌మీడియా వేదికగా తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు