ఐసీసీ న్యూజిలాండ్ కు పాయింట్ల కోత విధించింది. దీంతో ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఆశలకు గట్టి దెబ్బ తగిలినట్లయింది. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో మందకొడి బౌలింగ్ కారణంగా న్యూజిలాండ్ కు 3 పాయింట్ల కోత పడింది. ఈనేపథ్యంలో కివీస్ ర్యాంకింగ్స్ టేబుల్ లో మరింత కిందకి పోతుంది. ఇక పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, శ్రీలంక తర్వాత స్థానాల్లో ఉండగా… ఇంగ్లాండ్ ఇప్పటికే ఫైనల్ రేసు నుండి నిష్క్రమించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ కు కూడా 3 పాయింట్ల కోత పడింది.
Previous Articleప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్:మరో గేమ్ డ్రా
Next Article పుష్ప 3 టైటిల్ ఇదేనా.. ఫొటో వైరల్