అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రూల్.ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ఈరోజు l ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న ఈ సినిమా ప్రీమియర్ షోస్ పలు చోట్ల ప్రదర్శించారు. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన బెనిఫిట్ షో లో అపశృతి చోటు చేసుకుంది. అల్లు అర్జున్ ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.దీంతో తొక్కిసలాట జరిగింది. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో రేవతి అనే మహిళ అస్వస్థత కు గురైంది. ఆమెను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె తనయుడు కూడా అస్వస్థత కు గురికాగా పోలీసులు సీపీఆర్ చేశారు.
Previous Articleదూసుకుపోతున్న బిట్ కాయిన్ విలువ:1,00,000 డాలర్లు దాటి ముందుకు
Next Article పరారీలో ఉగ్రవాదులు, హంతకులు