బంగ్లాదేశ్ లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్న విషయం తెలిసింది.ఈ సమయంలో ఆ దేశ జైళ్ల శాఖ చీఫ్ సయిద్ మహమ్మద్ మొతాహెర్ హుస్సేన్ కీలక విషయాన్ని తెలియ జేశారు.జైళ్ల నుంచి ఉగ్రవాదులు తప్పించుకున్నారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కు వ్యతిరేకంగా ఈ ఏడాది ఆరంభంలో విద్యార్థులు, పలు సంఘాలు ఉద్యమాలు చేసిన విషయం తెలిసింది.ఆ సమయంలో జైళ్ల నుంచి దాదాపు 2000 మంది ఖైదీలు తప్పించుకున్నారు.అందులో 1500 మందిని అధికారులు పట్టుకున్నారు.మిగిలిన వారంతా పరారీ లో ఉన్నట్లు మహమ్మద్ హుస్సేన్ వెల్లడించారు. అందులో కనీసం 70 మంది ఉగ్రవాదులు, హంతకులు ఉన్నట్లు తెలిపారు.
Previous Articleపుష్ప బెనిఫిట్ షో.. మహిళ మృతి
Next Article సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు