ఏపి మాజీ సీఎం, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా వైసిపి నేతలతో సమావేశమైయ్యారు.ఈ మేరకు ఆయన ఈరోజు తాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ నేతలతో మాట్లాడుతూ… 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో కూటమి నేతలు అసత్య హామీలు ఇచ్చారని మండిపడ్డారు.అన్ని నియోజకవర్గాల ప్రజలతో మమేకమౌతామని వైఎస్ జగన్ చెప్పారు. జిల్లాలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజల తరుపున నిలబడాల్సిన సమయం వచ్చిందని పార్టీ కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు.