ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ వరుస డ్రా లతో కొనసాగుతోంది. తాజాగా మరో గేమ్ డ్రాగా ముగిసింది. ఇప్పటివరకు మొదటి గేమ్ లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ గెలుపొందగా.. రెండో గేమ్ డ్రా అయింది. మూడో గేమ్ లో భారత యువ కెరటం గుకేశ్ విజయం సాధించి సమంగా నిలిచాడు. ఆతర్వాత నుండి వరుస డ్రాలతో ఈ ఛాంపియన్ షిప్ సాగుతోంది. తాజాగా జరిగిన 9వ గేమ్ కూడా డ్రాగానే ముగిసింది. దీంతో మొత్తం 7 గేమ్ లు డ్రా అయ్యాయి. తాజా గేమ్ లో 54 ఎత్తుల తర్వాత గేమ్ డ్రా గా ముగిసింది. వరుసగా 6 గేమ్ లను డ్రాగా ముగించి చెరో 4.5 పాయింట్లతో ఇరువురు సమానంగా కొనసాగుతున్నారు. ఈ ఛాంపియన్ షిప్ లో ఇంకా 5 గేమ్ లు ఉన్నాయి.
Previous Articleమోక్షజ్ఞ సినిమా అందుకే మొదలు కాలేదు: బాలకృష్ణ
Next Article ఈ ఒప్పందం పౌర సదుపాయాల కల్పనలో ఒక మైలు రాయి