ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ హైవేలపై రూ.1,046 కోట్లతో చేపట్టిన 18 ఫ్లై ఓవర్ల నిర్మాణాలకు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ఆయా నిర్మాణాలు వివిధ దశలలో ఉన్నట్లు తెలిపారు. లోక్ సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఎన్.హెచ్-216ఏపై మోరంపూడి, జొన్నాడ, ఉండ్రాజవరం జంక్షన్, తేతలి, కైకవరం వద్ద నిర్మిస్తున్న 5 వంతెనలు పూర్తి కానున్నట్లు తెలిపారు. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ వచ్చే ఏడాది ఫిబ్రవరి, గుంటూరు మిర్చి యార్డు వద్ద నిర్మిస్తున్న వంతెన జనవరి 6 నాటికి ఎన్.హెచ్-16 పై గొలగమూడి జంక్షన్, నెల్లూరు టీ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న రెండు వంతెనలు వచ్చే ఏడాది సెప్టెంబర్ 11 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఇక ఎన్.హెచ్-16 పై నాగులుప్పలపాడు గ్రోత్ సెంటర్, రాజు పాలెం జంక్షన్ల వద్ద వంతెనల నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు వివరించారు. ఇంకా తలపెట్టిన వాటికి బిడ్లు పిలిచినట్లు పేర్కొన్నారు. మరికొన్నింటికి బిడ్లు పిలవాల్సి ఉందని తెలిపారు.
రాష్ట్రంలో నేషనల్ హైవేలపై 18 ఫ్లై ఓవర్ల నిర్మాణం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
By admin1 Min Read
Previous Articleభూటాన్ రాజు భారత పర్యటన: ప్రధాని మోడీతో సమావేశం
Next Article కీలక వడ్డీ రేట్లు యథాతథం:ఆర్.బీ.ఐ