స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డిగారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ మేరకు తెలంగాణ వరదల సమయంలో సహాయ చర్యలకు మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించిన రూ.15 లక్షల చెక్కును సీఏం
రేవంత్ రెడ్డికి అందజేశారు.విపత్తు సమయంలో సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటిన సిద్ధుజొన్నలగడ్డను సీఏం రేవంత్ రెడ్డి గారు అభినందించారు.


