దక్షిణాది అగ్ర సినీతార సాయి పల్లవితో నటించాలన్న,ఆమెతో డాన్స్ స్టెప్స్ వేయాలన్నా నీరసమొచ్చేస్తుందని నాగ చైతన్య అన్నారు.అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న “ది రానా టాక్ షో” లో ఈ కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.లవ్ స్టోరీలోనే సాయి పల్లవితో డాన్స్ చెయ్యాలంటే టెన్షన్ పడ్డాను అంటే…సాయి పల్లవి మాత్రం లేదు చాలా ఈజ్ తో చక్కగా చేసారు అంది.నాగ చైతన్య మాత్రం నువ్వు ఒక్కదానివే నా డాన్స్ ను పోగుతున్నావ్ అంటూ నవ్వేసాడు.అయితే నాగ చైతన్య లో నీకు నచ్చనిది ఏమైనా ఉందా అని రానా సాయి పల్లవిని ఫోన్ లో అడిగితే…సైలెంట్ గా,కూల్ గా ఉంటాడు,ఏదైనా ఇబ్బంది అయినా బయటకి చెప్పడు అది కోపం తెప్పిస్తుందని చైతు గురించి రానా కు సాయి పల్లవి తెలియజేసింది.
కాగా చైతన్య మాత్రం నువ్వు నీతో చేసిన చిత్రంలో సాయి పల్లవి తో పాటలు లేకుండా,డాన్స్ లేకుండా ఎస్కెప్ అయ్యావ్ అంటూ… రానాను ఆట పట్టించాడు.సాయి పల్లవిని రానా లో నచ్చేది ఏమిటి అని చైతన్య అడిగితే దానికి సాయి పల్లవి రానా కూడా సింపుల్ గా కూల్ గా సరదాగా ఉంటాడని
బదులిచ్చింది.

