బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయీ నటించిన సరికొత్త చిత్రం డిస్పాచ్. ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆయన విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో తన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. తాను ఒక పల్లెటూరి వాసినని అన్నారు. బీహార్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఒక రైతు కొడుకు.. ఈరోజు చిత్రపరిశ్రమలో గొప్ప స్థాయిలో ఉన్నాడంటే నమ్ముతారా ఎవరైనా? ఎంతో శ్రమించి.. నా కలలు నిజం చేసుకున్నానని అన్నారు. ‘సత్య’ నా కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా. భికూ మాత్రే పాత్ర నాకు ఎన్నో ప్రశంసల్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత అలాంటి అవకాశాలు నాకు ఎన్నో వచ్చాయి. ఈ మూస ధోరణిలో పాత్రల్ని ఎంచుకోవడానికి ఫుల్‌స్టాప్ పెట్టాలనుకున్నా. చాలా మంది దర్శకనిర్మాతలు నేను ఈ పాత్రల్లో నటించడానికి నిరాకరిస్తే డబ్బును ఆఫర్ చేశారు. కానీ చిత్రపరిశ్రమలో నేను విలన్‌గా ఉండాలనుకోవట్లేదు అని తెలిపారు.
Previous Articleమానసిక స్థితి బాలేదంటూ.. భారత్‌లోకి ఐఎస్ఐ ఏజెంట్లు
Next Article కన్నీళ్లు పెట్టుకుంటూనే సంతకం చేసిన ప్రియాంక