భారత్‌ను దెబ్బతీసేందుకు పాకిస్థాన్ దేనికి వెనకాడటం లేదు. భారత్ జైళ్లలో ఉన్న కరుడుగట్టిన ఉగ్రవాదులతో సంప్రదింపులు జరపడం, వారికి కీలక సమాచారాన్ని చేరవేసేందుకు పాకిస్థాన్ గూఢచార సంస్థ కొత్త పన్నాగాలు పన్నుతున్నట్లు సమాచారం. డ్రగ్స్ మత్తు లేదా మానసిక స్థితి సరిగా లేనివారిగా నటిస్తూ కొంతమంది వ్యక్తులు భారత్‌లోకి చొరబడుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఐదారు నెలల్లోనే దాదాపు పది మంది పాకిస్థానీయులు పీవోకే నుంచి భారత్‌లోని ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. వారు జమ్మూ, పంజాబ్, రాజస్థాన్‌లలోని జైళ్లలో ఉన్నట్లు చెప్పారు.భారత్‌లోకి చొరబడిన పాకిస్థాన్ జాతీయులను ఐఎస్‌ఐ ఏజెంట్లుగా భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఇక్కడి జైళ్లలో ఉన్న పాక్ ఖైదీలకు కీలక సమాచారం చేరవేయడమే లక్ష్యంగా వీరు పని చేస్తున్నట్లు సమాచారం. భద్రతా దళాలు అడిగే ప్రశ్నలకు దీటుగా సమాధానమిచ్చి బయటపడే పద్ధతులపైనా వీరు శిక్షణ పొందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఉపయోగిస్తే వారి మోసాలు బయటపడుతాయన్న భయంతోనే ఐఎస్‌ఐ కొత్త దారులను అనుసరిస్తోందని అధికారులు చెబుతున్నారు.
Previous Articleసిరియాలో కీలక పరిణామాలు: దేశం వదిలిపోయిన సిరియా అధ్యక్షుడు
Next Article నాకు విలన్ గా ఉండాలని లేదు: మనోజ్