బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం హాలీవుడ్‌లో కొనసాగుతున్నారు నటి ప్రియాంక చోప్రా. కెరీర్ ఆరంభంలో ప్రియాంక ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆమె తల్లి మధు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రియాంకకు అసలు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదన్నారు. ‘అప్పట్లో మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన ప్రియాంకకు సినిమాల్లో అవకాశాలు వరుస కట్టాయి. కానీ ఆమెకు నటించాలనే ఆసక్తి లేదు.చదువులో కొనసాగుతూ…క్రిమినల్ సైకాలజి పూర్తిచేయాలనుకుంది.అందుకోసం సన్నద్ధమవుతున్న సమయంలో సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి.చదువులు ఎక్కడికి పోవు, ఒక్క సినిమాలో నటించమని ఆమెపై నేనే ఒత్తిడి తెచ్చాను.ఆ తరవాత ఈ రంగంలో కొనసాగాలా వద్దా అనేది నీ నిర్ణయమని చెప్పాను.నా బలవంతంతో తన మొదటి చిత్రానికి కన్నీళ్లు పెట్టుకుంటూ సంతకం చేసింది అని ఆనాటి రోజులు గుర్తు చేసుకున్నారు.
Previous Articleనాకు విలన్ గా ఉండాలని లేదు: మనోజ్
Next Article న్యూఢిల్లీలో స్కూల్స్ కు బాంబు బెదిరింపులు…!