రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. రాజమౌళి దీనిని తెరకెక్కించారు. భారతీయ సినిమా స్థాయిని నలు దిశలకు వ్యాపింప చేసిన చిత్రాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ అనే చిత్రం తెరకెక్కించడం వెనుక అసలు ఏం జరిగింది? కథ ఎలా సిద్ధమైంది? షూటింగ్ ఎక్కడ జరిగింది? అనే అంశాలు తెలుసుకోవాలన్న ప్రేక్షకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని చిత్రబృందం ఒక డాక్యుమెంటరీ సిద్ధం చేసింది.”ఆర్‌ఆర్‌ఆర్ బిహైండ్ అండ్ బియాండ్” పేరుతో దీనిని రూపొందించనున్నారు.వచ్చే ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఓటీటీలో విడుదల చేస్తారా? లేదా మరేదైనా ప్లాట్‌ఫామ్‌లోనైనా విడుదల చేస్తారా? అనేది చెప్పలేదు.
The REELS that inspired Millions.
The REAL that deserves to be told.𝐑𝐑𝐑: 𝐁𝐞𝐡𝐢𝐧𝐝 & 𝐁𝐞𝐲𝐨𝐧𝐝 – Coming this December 🔥🌊 #RRRBehindAndBeyond #RRRMovie #RRR pic.twitter.com/8qz9sF9fUG
— DVV Entertainment (@DVVMovies) December 9, 2024

