ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు సినీ దిగ్గజం, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు సినీ ప్రస్థానానికి 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఈనెల 14న సినీ వజ్రోత్సావాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ వెల్లడించారు. విజయవాడ పోరంకి లోని మురళీ రిసార్ట్స్ వేదికగా జరుగనున్న ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. ఎన్టీఆర్ అంతరంగాన్ని ప్రతిబింబించే విధంగా ‘తారకరామం’ పుస్తకాన్ని ఆవిష్కరించినున్నారు. ప్రత్యేక గీతాన్ని విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తిరువనంతపురం, ముంబై, చెన్నై, బెంగళూరులో ఏడాదిపాటు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సావాలు నిర్వహిస్తామని తెలిపారు.
Previous Articleకాంగ్రెస్ పార్టీ , సోనియా గాంధీలపై బీజేపీ సంచలన ఆరోపణలు …!
Next Article ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై డాక్యుమెంటరీ