ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించిన విషయం విదితమే. కాగా, ఈనేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. టీచర్లు- విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కొత్తేమీ కాదు. క్రమం తప్పకుండా గతంలోనుంచీ జరుగుతున్నవేనని సహజంగా ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరు మార్చి, ఆ సమావేశాలు ఏదో ఇప్పుడే జరుగుతున్నట్టుగా, వాటిని ప్రచార వేదికలుగా మార్చుకుని చంద్రబాబుగారి కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని అన్నారు. వైసీపీ హయాంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లను, విద్యారంగాన్ని ఒకవైపు నాశనం చేస్తూ, అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులను దగాచేసి, మళ్లీ ఇప్పుడు రొటీన్‌గా జరిగే పేరెంట్స్ సమావేశాలపై పబ్లిసిటీ చేయించుకోవడం, ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబుగారు మాత్రమే ఇలాంటివి మోసాలు చేయగలరని విమర్శించారు. వైసీపీ హయాంలో ప్రతి విప్లవాత్మక మార్పులోనూ, అమలు చేసిన ప్రతి సంస్కరణలోనూ పిల్లల తల్లిదండ్రుల ఆలోచనలు, వారి భాగస్వామ్యాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నారు. విద్యాదీవెన, వసతి దీవెనల కింద గతంలో విద్యార్థులకు ఇచ్చే తోడ్పాటు ఇప్పుడు లభిస్తోందా? అని ప్రశ్నించారు. గతంలో ఉన్న అమ్మ ఒడి పథకాన్నీ ఆపేశారని అన్నారు.ప్రపంచస్థాయిలో గవర్నమెంటు స్కూలు పిల్లలను తయారుచేసేలా 3వ తరగతి నుంచి ప్రవేశపెట్టిన టోఫెల్ క్లాసు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ల విధానం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, ఫ్యూచర్ టెక్నాలజీపై తరగతులు.. ఇలా ఇవన్నీ ఎందుకు ఆపేశారు? అని జగన్ ప్రశ్నించారు.
విద్యాదీవెన, వసతి దీవెనల కింద గతంలో విద్యార్థులకు ఇచ్చే తోడ్పాటు ఇప్పుడు లభిస్తోందా?: మాజీ సీఎం జగన్
By admin1 Min Read