రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది.గతంలో ఆయనకు రెవెన్యూ శాఖ కార్యదర్శి గా వర్క్ చేసిన అనుభవం వుంది.రేపటి నుంచి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.మూడేళ్ల పాటు ఆయనకి ఈ అధికారాలు కలిగి ఉంటారు.
ప్రస్తుతo గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం రేపటితో ముగియనుంది.దీంతో కేoద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది.2018లో ఆర్ బీ ఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్.. పదవీ కాలం 2021లోనే పూర్తి అయింది.అయితే కేంద్రం ఆయన పదవిని మరో మూడేళ్లు పొడిగించింది.ఈ గడువు కూడా డిసెంబర్ 10తో ముగుస్తుంది.