భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత పేసర్ సిరాజ్, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ మధ్య పరస్పరం మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. వీరివురిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్యలకు ఉపక్రమించింది. మహామ్మద్ సిరాజ్ కు 20% ఫైన్ విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి లోని ఆర్టికల్ 2.5ని ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించింది. ఇక ఇద్దరికీ చెరొక డీ మెరిట్ పాయింట్లు ఇచ్చింది. ఇద్దరూ తమ తప్పు అంగీకరించారని మ్యాచ్ రిఫరీ ప్రతిపాదించిన చర్యలకు అంగీకారం తెలిపినట్లు పేర్కొంది.
Previous Articleఆ వార్తలు నమ్మవద్దు :- జాని మాస్టర్
Next Article ఏపీ డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్

