ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయ సిబ్బందికి ఆగంతకుడి నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఒక ఆగంతకుడు చంపేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ సందేశాలు పంపించినట్లు జనసేన పార్టీ సోషల్ మీడియాలో పేర్కొంది. పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్, మెసేజులను ఉప ముఖమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు. పేషీ అధికార్లు బెదిరింపు కాల్స్, మెసేజుల విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి పేషీకి బెదిరింపు కాల్స్
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి కార్యాలయ సిబ్బందికి ఆగంతకుడి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని హెచ్చరించిన ఆగంతకుడు. ఆ క్రమంలో అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ మెసేజులు పంపించాడు. పేషీ సిబ్బంది బెదిరింపు…
— JanaSena Party (@JanaSenaParty) December 9, 2024