విక్రమ్ కథానాయకుడిగా దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కించిన చిత్రం “తంగలాన్”.ఇందులో పార్వతి తిరువోతు,మాళవికా మోహనన్ కీలక పాత్రలు పోషించారు.ఆగస్టులో విడుదలైన ఈ చిత్రం ఎంతోకాలం నుండి ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.ఇందులో కొన్ని మతాలను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ … చిత్రం ఓటీటీ విడుదలను నిలిపి వేయాలని కోరుతూ మద్రాసు కోర్టులో ప్రజాప్రయోజన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
సెన్సార్ సర్టిఫికెట్ పొంది థియేటర్‌లో విడుదలైంది కాబట్టి ఓటీటీ విషయంలో నిర్ణయం తీసుకోలేమని కోర్టు తెలిపింది.ఓటీటీ విడుదల చేయడానికి ఎలాంటి అడ్డంకి లేదని ఆదేశించింది.దీనితో తాజాగా ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది.నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగు,తమిళం,మలయాళం,కన్నడ,
హిందీలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.