లాభాలు ఆశచూపి పెట్టుబడుల పేరుతో కోట్లు కొల్లగొడుతున్న కాల్ సెంటర్ల గుట్టును రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ బయటపెట్టింది.అంతర్జాతీయ నెట్వర్క్గా పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా ప్రజలను వీరు మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు.ఈ కాల్సెంటర్లలో పనిచేసేవారు రోజూ వివిధ దేశాలకు చెందిన వందల మందికి ఫోన్ చేసి పెట్టుబడుల స్కీమ్లు అంటూ ఆశజూపుతున్నారు. భారీ లాభాలు వస్తాయంటూ వారిని బుట్టలో వేసుకుని డబ్బుల కట్టించుకుంటారు.
ఇలాంటి మోసపూరిత చర్యలతో బాధితుల నుంచి రోజుకు కనీసం 1 మిలియన్ డాలర్ (భారత కరెన్సీలో దాదాపు రూ.8 కోట్లు) దోచుకుంటున్నారని అధికారులు తెలియజేశారు. భారత్ తోపాటు దాదాపు 50కి పైగా దేశాల్లో వీరి బాధితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన వారు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.

