బంగ్లాదేశ్‌కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు,సైన్యాధికారులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.బెంగాల్,బిహార్,ఒడిశాలు తమ దేశంలో అంతర్భాగమంటూ బంగ్లాదేశ్‌కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు,మాజీ సైన్యాధికారులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు.
పశ్చిమబెంగాల్ శాసనసభలో ఆమె ఈ విషయంపై మాట్లాడారు. బంగ్లా నాయకులు అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.‘‘మీరు బెంగాల్, బిహార్, ఒడిశాలను ఆక్రమిస్తుంటే మేం లాలీపాప్‌లు తింటూ కూర్చుంటామా? ఆ ఆలోచన కూడా చేయకండి’’ అని హెచ్చరించారు.భారత్ వైపు చూసే దమ్ము ఎవరికీ లేదు అని దీదీ తెలిపారు.అలాంటి ఆలోచనలు మానుకోవాలని ఆ దేశ నాయకులకు సూచించారు.బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఆమె తీవ్రంగా ఖండించారు.