తన కుటుంబంలో జరుగుతోన్న గొడవల గురించి తాజాగా మీడియాతో మాట్లాడారు నటుడు మంచు మనోజ్.ఆస్తి, డబ్బు కోసం తాను పోరాటం చేయడం లేదని…ఆత్మ గౌరవం కోసమే తాను పోరాడుతున్నానని అన్నారు.తనకు ప్రాణహని ఉందని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు తనకు రక్షణ ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనకు న్యాయం కావాలని పెద్దలను కలుస్తానని ఆయన తెలిపారు. ‘‘నేను చేసేది ఆత్మగౌరవ పోరాటం.ఇది నా భార్య, పిల్లల రక్షణకు సంబంధించిన విషయం.నన్ను అణగదొక్కేందుకు నా భార్యను బెదిరించారు. నా ఏడునెలల పాపను దీనిలోకి లాగారు. నా పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు. పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ కోరాను. నాకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తామనే వారు నా మనుషులను బెదరగొట్టి వేరే వాళ్లని లోపలికి పంపించారు. నా మనుషులను ఇక్కడి నుంచి పంపించే అధికారం పోలీసులకు ఎక్కడిది? ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?నాకు మద్దతు కోసం అందర్నీ కలుస్తా’’ అని మనోజ్ తెలిపారు. మరోవైపు మోహన్‌బాబు కూడా ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు.అందరి ఇళ్లల్లో ఇలాంటి గొడవలు సర్వసాధారణం అన్నారు. పెద్దల సమక్షంలో వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. తాను ఎంతోమంది గొడవలు పరిష్కరించానని.. ఎన్నో కుటుంబాలను కలిపానని అన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు