రాజ్యసభ ఛైర్మన్ గా ఉన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పై కాంగ్రెస్ నేతృత్వంలోని ఐ.ఎన్.డి.ఐ.ఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆయన పక్షపాత ధోరణిలో వ్యవహారిస్తున్నారని ఆరోపించింది. తీర్మానం ప్రవేశపెట్టాలంటే 50 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది కాగా 70 మంది మద్దతుగా సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు ఒకరు తెలిపారు. ఇక పార్లమెంటులో విపక్షాల నిరసనలపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. సభా గౌరవాన్ని కాపాడుకునేలా ప్రవర్తించాలని కోరారు. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని ప్రజల ఆకాంక్షలని నెరవేర్చే విధంగా కృషి చేయాలన్నారు. ఇక ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.
పార్లమెంటులో కీలక పరిణామం: రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ పై అవిశ్వాస తీర్మానం
By admin1 Min Read