ఆర్థికపరమైన,రెగ్యులేటరీ సమస్యలతో ఇబ్బందిపడుతున్న బోయింగ్ సంస్థ ఉద్యోగుల్ని క్రమపద్ధతిలో తొలగించనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలోని బోయింగ్ సంస్థలో భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించారు. వాషింగ్టన్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఉన్న అదనపు ఉద్యోగులను తీసి వేశారు. సుమారు 17 వేల మందిని తొలగించే పనిలో బోయింగ్ సంస్థ ఉన్నది. ఈ నేపథ్యంలోనే వాషింగ్టన్ రాష్ట్రంలో 400 మంది, కాలిఫోర్నియా రాష్ట్రంలో 500 మందిని సంస్ధ విధుల నుంచి తప్పించింది. అయితే, లేఆఫ్‌ల గురించి ఉద్యోగులకు ఇప్పటికే సమాచారం అందించడం జరగిందని ఆ సంస్థ తెలిపింది.
Previous Articleచివరి షెడ్యూల్ లో హారిహార వీర మల్లు: పాల్గొన్న పవన్ కళ్యాణ్
Next Article అమెరికాకు కెనడా ప్రధాని హెచ్చరిక…!