ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలిపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీ.ఆర్.డీ.ఏ) ఆమోదించిన 20 సివిల్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పనులకు సంబంధించి రూ.11,467 కోట్ల వ్యక్తమవుతుందని పేర్కొంది. వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో ఈ పనులు చేపట్టే విధంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, ప్రజా ప్రతినిధుల నివాసాలు, ఉద్యోగుల నివాస అపార్ట్మెంట్లు, ఐఏఎస్ అధికారుల నివాసాల నిర్మాణలు పూర్తి చేయడానికి నిధులు విడుదలకు ఆమోదం తెలిపింది. జడ్జిలు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. అసెంబ్లీ, రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించింది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో భాగంగా 12 టవర్లలో 1200 అపార్ట్మెంట్లు కోసం రూ.984 కోట్లు, నీరుకొండ వద్ద రిజర్వాయర్ నిర్మాణం కోసం రూ.1585 కోట్లు సీ.ఆర్.డీ.ఏ ఖర్చు చేయనుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు