తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అన్యాయం అని బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.తాజాగా ఆమె ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.బతుకమ్మను విగ్రహంలో చేర్చకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు.బతుకమ్మను ఎందుకు పెట్టలేదని ఆమె ప్రశ్నించారు.ఉద్యమ కాలంలో పెద్దలు నిర్ణయించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకగా భావించే బతుకమ్మను విగ్రహంలో ఎందుకు చేర్చలేదు? తొమ్మిది మంది కళాకారులను సన్మానిస్తామన్నారు..ఆ జాబితాలో మహిళలు ఎక్కడ? స్ఫూర్తి నింపే తెలంగాణ తల్లి విగ్రహం కాదని…కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు.ఉద్యమకాలం నాటి ప్రతీకలను అవమానించే ప్రయత్నం చేస్తున్నారు.సచివాలయంలో పెట్టిన కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నాం’’ అని తెలిపారు.
Previous Articleబాక్సింగ్ డే టెస్టుకు ఫుల్ డిమాండ్: భారీగా అమ్ముడైన టికెట్లు
Next Article రాజధాని అమరావతిలో చేయాల్సిన పనులకు ఆమోదం