అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన చిత్రం పుష్ప 2 ది రూల్.ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించాడు.ఇందులో రష్మిక కథానాయిక నటించింది.ఈ నెల 5వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా ఇది విడుదల అయింది.అల్లు అర్జున్ నటనకు సినీ ప్రియులు ఫిదా అయ్యారు.తాజాగా ఈ చిత్రం మరో రికార్డు కొల్లగొట్టింది.విడుదలైన 6 రోజుల్లోనే రూ.1000 కోట్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది.బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్, కల్కి 2898 ఏడీ చిత్రాల తర్వాత రూ.1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన చిత్రం పుష్ప2 కావడం విశేషం.దీనిపై అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Previous Articleఘనంగా కీర్తి సురేష్ వివాహం
Next Article 2035 ఏడాదికి భారత్ కు సొంత స్పేస్ స్టేషన్…!